బస్సు బోల్తా..ఒకరు మృతి

by srinivas |
బస్సు బోల్తా..ఒకరు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మండలం గౌరవరం వద్ద నారాయణ మూర్తి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందారు. కాగా మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై నుంచి పశ్చిమబెంగాల్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా నిద్రమత్తులో డివైడర్‌ను ఢీ కొట్టడంతో బస్సు బోల్తాపడిందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Next Story