ఫోన్ ఇవ్వలేదని ఫ్యాన్‌కు ఉరేసుకున్న బాలుడు

by Shyam |
boy suicide
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… చిట్యాల గ్రామానికి చెందిన రంగప్ప ఆన్‌లైన్ క్లాసులు వింటాడని కొడుకు ఉపేంద్ర కోసం ఇటీవల ఫోన్ కొన్నాడు. శనివారం ఫోన్‌ బీరువాలో పెట్టి తాళం వేసి పక్క ఊరికి వెళ్లాడు. దీంతో తండ్రి తనకు ఫోన్ ఇవ్వకుండా బీరువాలో పెట్టి వెళ్లాడని తీవ్ర మనస్థాపం చెందిన ఉపేంద్ర తల్లి పనికి వెళ్లాక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Next Story