- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారం రోజుల తర్వాత అంతయ్య మృతదేహం లభ్యం
దిశ, సిటీ బ్యూరో : పూడిక తీస్తూ గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యమయ్యింది. ఈనెల మూడవ తేదీన ఎల్బీ నగర్‌లోని పద్మావతి నగర్‌లో పూడిక తీస్తూ గల్లంతైన ఇద్దరు కార్మికుల్లో ఒక కార్మికుడు అంతయ్య డెడ్ బాడీని ఎట్టకేలకు ఈరోజు(సోమవారం) ఉదయం గుర్తించారు. డెడ్ బాడీ కోసం జీహెచ్ఎంసీ, ఆర్ ఎఫ్ బృందాలు 7 రోజులుగా వెతుకుతున్నా లభ్యం కాకపోవడంతో బెంగుళూరుకు చెందిన అజంతా టెక్నాలజీస్ ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన 24 గంటల ముందే అంతయ్య శవాన్ని గుర్తించారు. ఈ నెల 3న శివ, అంతయ్య గల్లంతైన ప్రదేశం నుంచి పన్నెండవ డ్రైనేజీలో మృతదేహం ఉన్నట్టు ఈ బృందాలు కని పెట్టాయి.
శివ మృతదేహం దొరికిన మరుసటి రోజే గుర్తించినప్పటికీ, మృతదేహం ఆచూకీ తెలియకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు 350 డ్రైనేజీలను ఓపెన్ చేసి డెడ్ బాడీ కోసం అన్వేషించారు. ఫలితం దక్కకపోవడం, మరోవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి రావటం, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారులు ఈ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. డెడ్ బాడీని గుర్తించిన సాహెబ్‌నగర్ ప్రాంతంలో మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నాకు ఇంకా న్యాయం జరగలేదని, అంతయ్య భార్య ధర్నాకు దిగారు. తన కొడుకుకి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని చేశారు. డెడ్ బాడీనీ గుర్తించిన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యుల న్యూ సముదాయించే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌తో చర్చించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినా, మృతుడి కుటుంబ సభ్యులు కుటుంబ అంగీకరించకుండా ధర్నా కొనసాగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.