- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఏసీపీ..

దిశ, హుస్నాబాద్: నేర రహిత సమాజానికి పోలీసులు అనునిత్యం పాటుపడతారని హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో, ఫ్లాగ్ డే సందర్భంగా అక్కన్నపేట పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తం దానం చేయడం ద్వారా దాతలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ రవి, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రెటరీ ఎంఎల్ఎన్ రెడ్డి, వైద్యాధికారి లావణ్య మెడికల్, పోలీస్ సిబ్బందితో పాటు యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.