- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యశోదా ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు టెస్టులు..
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో బుధవారం రాత్రి వ్యక్తిగత డాక్టరు పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగాయి. కరోనా బారిన పడిన తర్వాత మూడు రోజులుగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసొలేషన్‌లో ఉన్న కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని భావించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావ్ ఆయనను యశోద ఆసుపత్రికి వెళ్ళాల్సిందిగా సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆయన బుధవారం రాత్రి యశోద ఆసుపత్రికి చేరుకుని గంట వ్యవధిలోనే తిరిగి ఫామ్ హౌజ్‌కు వెళ్ళిపోయారు.
వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఊపిరితిత్తులకు ఏ మేరకు ఇన్‌ఫెక్షన్ సోకింది తదితరాలను పరీక్షించడానికి సీటీ స్కాన్ పరీక్షతో పాటు డీ-డైమర్, సీ-రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్పీ) టెస్టు, ఐఎల్-6, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లాక్ పిక్చర్ తదితర పరీక్షలు నిర్వహించినట్లు యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హాలియాలో ఈ నెల 14న జరిగిన ఎన్నికల బహిరంగసభ తర్వాత నలతగా కనిపించిన కేసీఆర్ రాపిడ్ టెస్టు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తర్వాతి రోజు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్ రిపోర్టే వచ్చింది. దీంతో ఫామ్ హౌజ్‌లోనే ఐసొలేషన్‌లో ఉండిపోయారు.
కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, బంధువు హరీశ్‌రావు తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. టెలిఫోన్ ద్వారా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, పలువురు మంత్రులు పరామర్శించారు. జలుబు, దగ్గు లాంటి స్వల్ప లక్షణాలు మొదటి రోజు కనిపించినా ప్రస్తుతం తగ్గిపోయినట్లు తెలిపారు. ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా లేవని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. కరోనా లక్షణాలన్నీ పోయినట్లు వివరించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే విధులకు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సాధారణ టెస్టులే తప్ప ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆక్సిజన్ లెవల్ కూడా సాధారణంగానే ఉందన్నారు. సీటీ స్కాన్‌లో కూడా నార్మల్ వ్యాల్యూస్ వచ్చినట్లు తెలిపారు.