- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌తో కరోనాను జయించలేం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో కరోనాను జయించలేమని కాంగ్రెస్ నేత, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. లాక్‌డౌన్ అనేది కరోనా వ్యాప్తికి పాజ్(కొద్ది కాలం ఆపి పెట్టే బటన్) బటన్ లాంటిదని, మహమ్మారిని పోస్ట్‌పోన్ చేసే పరికరం వంటిదని చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తేయగానే మహమ్మారి మళ్లీ విజృంభించే ప్రమాదముంటుందని తెలిపారు. లాక్‌డౌన్ నుంచి బయటికి వచ్చేందుకు తప్పకుండా మనకు ఒక వ్యూహముండాలని పేర్కొన్నారు. కరోనాపై పోరులో టెస్టింగే(కరోనా టెస్టులు) సమర్థవంతమైన ఆయుధం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఒక వీడియో యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో సర్కారుకు కొన్ని సూచనలు చేస్తూ వాటిని విమర్శలుగా తీసుకోవద్దని అన్నారు. ఇప్పుడు దేశం సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటున్నదని తెలిపారు. తాను గతంలోకి వెళ్లాలనుకోవడం లేదని, ఈ కష్టకాలంలో అందరం కలిసి పోరాడాలని, విలువైన సూచనలు పాటించి కరోనాను తరిమేయాలనే భావిస్తున్నట్టు చెప్పారు.
కరోనాపై పోరాటానికి సంసిద్ధమయ్యేందుకు లాక్‌డౌన్ మనకు కొంత సమయాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలని, ఆరోగ్య వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలని, వైద్య సంబంధ పరికరాలను సమకూర్చుకోవాలని అన్నారు. అంతేకానీ, లాక్‌డౌన్.. ఎట్టిపరిస్థితుల్లో కరోనాను జయించలేదని, కొంత కాలం దానికి కళ్లెం మాత్రమే వేయగలుగుతుందని వివరించారు. కరోనాపై పోరాటం పైస్థాయి నుంచి కింది స్థాయికి కాదు.. కింది స్థాయి నుంచి పైస్థాయికి జరగాలని అన్నారు. కేంద్ర పరిధిలోని వనరులను రాష్ట్రాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కరోనాపై పోరును పటిష్టం చేయాలని సూచించారు. దీనికి రాష్ట్రాలకు సహకరించాలని, ఆర్థికంగా వాటికి తోడ్పాటునివ్వాలని అన్నారు. మనమిప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నాం. ఇది వరకు చేసిందేదో? చేయనిదేదో? తాను ప్రశ్నించడం లేదని చెప్పారు. అయితే, ఇకపై చేయాల్సిన దానిపైనే దృష్టిపెడదామన్నారు. కరోనాను కట్టడి చేసే తగిన విధానాలను మాత్రమే అనుసరించాలని సూచిస్తున్నట్టు తెలిపారు. మనమంతా వ్యూహాత్మకంగా, ఉన్న వనరులను సమర్థంగా వాడుకునే విధానాలను అనుసరించాలని వివరించారు. కేంద్రం కరోనా వ్యాప్తి మార్గాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుందని, తమ తమ పరిధిలో ఈ మహమ్మారిపై పైచేయి సాధించడం రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అందుకే రాష్ట్రాలకు సహాయకారిగా కేంద్రం ఉండాలని చెప్పారు. ఒకవేళ లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలనుకున్నా.. లేదా ఎత్తేయాలనుకున్నా ఆ నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టాలని తెలిపారు.
కరోనాపై పోరాటంలో టెస్టింగ్ కీలక ఆయుధమని రాహుల్ గాంధీ అన్నారు. మన దేశంలో కరోనా టెస్టులు చాలా స్వల్పంగా జరుగుతున్నాయని చెప్పారు. పది లక్షల మందికి 199 మంది చొప్పున టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారీగా టెస్టులు నిర్వహించి రాష్ట్రాలకు ఈ పోరులో కేంద్రం వ్యూహాత్మకంగా సహకరించాలని చెప్పారు. సర్కారు కరోనా వెంట పరుగెడుతున్నది కానీ, దానికంటే ముందుకెళ్లి అడ్డుకోవడం లేదని అన్నారు. అనుమానితులుగా గుర్తించినవారికే టెస్టులు జరుపుతున్నారని దీంతో.. వైరస్ వెళ్లుతున్న డైరెక్షన్ వెంట మనం పరుగెడుతున్నట్టవుతున్నదని తెలిపారు. విరివిగా టెస్టులు జరపాలని ఆయన బలంగా చెప్పారు. విస్తృత టెస్టులతోనే వైరస్ చేరని చోటుకు దాన్ని వెళ్లనివ్వకుండా అడ్డుకునే వీలుంటుందని వివరించారు.
ఈ కాలంలో పేదల ఆకలి తీర్చే ప్రణాళికలను మోడీ సర్కారు అనుసరించాలని రాహుల్ చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిన ‘న్యాయ్’ స్కీమ్‌ను కేంద్రం అమలు చేయాలని సూచించారు. ఇది ఆకలి తీర్చే ప్రణాళికలకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. దీంట్లో ఏ రాజకీయమూ లేదని, కావాలనుకుంటే దాని పేరు మార్చయినా అమలచేస్తే బాగుంటుందని వివరించారు. ఈ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని అంచనా వేశారు. మొదటి దశ ఉద్యోగుల కోతలు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. ప్రజల జీవితాలను కాపాడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా ఒక డిఫెన్స్ ప్యాకేజీని రూపొందించాలని, వ్యూహాత్మకమైన పెద్ద కంపెనీల రక్షణకు చర్యలు తీసుకోవాలని వివరించారు.
ఈ పోరాటంలో ప్రధాని ఎక్కడ తప్పటడుగు వేసినట్టు భావిస్తున్నారని రాహుల్ గాంధీని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. దీనికి ఇప్పుడు సమాధానం చెప్పబోరన్నారు. కరోనావైరస్ పై పైచేయి సాధించిన రోజు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తారని అన్నారు.
Tags: rahul gandhi, lockdown, testing, weapon, preempt, congress, contain, defence package, food safety