తాడిపత్రి జంక్షన్‌లో టెన్షన్ టెన్షన్

by srinivas |
tadipatri 1
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం హైడ్రామా నెలకొంది. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించి పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ ఇండ్ల ముందు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆమరణ దీక్ష చేస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలను పోలీసులు విఫలం చేశారు. దీక్షకు బయల్దేరుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. తన ఇంటి ముందే ఆయన భైఠాయించారు. దీనికి తోడు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమా రెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్దకు కారులో వెళ్లారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కారును దిగకుండా అడ్డుకున్నారు. అనంతరం ఇంటి వద్ద వదలేశారు. ఈ పరిణామాల మధ్య తాడిపత్రి జంక్షన్‌లో టెన్షన్ వాతావరణ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed