తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మరో క్రీడాకారుడు..

by Shyam |   ( Updated:2021-10-29 06:59:02.0  )
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మరో క్రీడాకారుడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలా మంది సినీనటులు, క్రీడాకారులు రాజకీయరంగ ప్రవేశం చేస్తు్న్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. 2022లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వనిస్తున్నది.

ఈ క్రమంలోనే నటి నఫీసా అలీ మరియు కార్యకర్త మృణాళిని దేశ్‌ప్రభు కుడా మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. టెన్నిస్ ఆటగాడిగా మంచి పేరు సంపాదించుకుని రిటైర్ అయిన పేస్ రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని, దేశంలో మార్పు కోసం తన వంతు కృషి చేయనున్నట్టు తెలిపాడు. అందుకోసమే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ పార్టీలో చేరినట్టు లియాండర్ పేస్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story