- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 100 కోసం ఇంట్లో గొడవ.. యువకుడు మృతి
దిశ, బోనకల్లు: అదృశ్యమైన ఓ యువకుడు మృతిచెంది శవమై కనిపించిన ఘటన మండలంలోని సీతానగరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీతానగరం గ్రామానికి చెందిన తాళ్లూరు విజయ్(20) గ్రామంలోని రైస్ మిల్లు వద్ద రోజు కూలి పనికి వెళ్తుంటాడు. విజయ్ ఒకరోజు తల్లిదండ్రులను రూ.100 కావాలని అడగడంతో ఎందుకు నీకు డబ్బులని ప్రశ్నించి.. డబ్బులు ఇవ్వమని నిరాకరించారు. అప్పుడు విజయ్ ఇంటిలో ఉండను అంటూ వెళ్లిపోయాడు. శుక్రవారం వరకు విజయ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. కొడుకు ఆచూకీ లభ్యం కోసం ఫిర్యాదు చేస్తే తన కొడుకు ఆత్మహత్య చేసుకుని మృత్యువాత పడ్డాడన్న విషయాన్ని తెలుసుకుని తల్లిదండ్రులు బోరున విలపించారు. వైరా మండలం గొల్లపూడి గ్రామ సమీపంలో సుబాబుల్ తోటలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిసర ప్రాంత రైతులు సుబాబులు తోటలో మృతదేహం కనిపించడంతో సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.