Jyotika: నా హృదయాన్ని టచ్ చేశావ్.. యంగ్ హీరోయిన్‌పై జ్యోతిక ప్రశంసలు (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-11-06 11:04:03.0  )
Jyotika: నా హృదయాన్ని టచ్ చేశావ్.. యంగ్ హీరోయిన్‌పై జ్యోతిక ప్రశంసలు (పోస్ట్)
X

దిశ, సినిమా: దీపావళి కానుకగా అమరన్(Amaran), లక్కీ భాస్కర్, క సినిమాలు థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ‘అమరన్’ మూవీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) దర్శకత్వం వహించారు. అమరన్ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే పలువురి ప్రశంసలు కూడా అందుకుంటుంది.

తాజాగా, స్టార్ హీరోయిన్ సూర్య భార్య జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘అమరన్’ మూవీకి రివ్యూ ఇవ్వడంతో పాటు సాయి పల్లవి(Sai Pallavi)పై ప్రశంసలు కురిపించింది. ‘‘అమరన్ టీమ్‌కు సెల్యూట్. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మీరు సృష్టించిన అద్భుతం ఇది. ‘జై భీమ్’(Jai Bheem) తర్వాత తమిళంలో మరో క్లాసిక్. శివకార్తికేయన్‌(Sivakarthikeyan)కు అభినందనలు. ఈ పాత్రను చేయడానికి మీరు చేసిన కృషి, శ్రమను నేను ఉహించగలను. సాయి పల్లవి ఎంతటి గొప్ప నటి. ఆమె చివరి 10 నిమిషాల్లో నా హృదయాన్ని, శ్వాసను ఆపేశారు.

నిన్ను చూసి గర్విస్తున్నాను. శ్రీమతి ఇందు రెబెక్కా వర్గీస్(Indhu Rebecca Varghese) మీ త్యాగం, సానుకూలత మా హృదయాలను తాకాయి. అలాగే మా ఆత్మలను వెలిగించాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukund Varadarajan) -ప్రతి పౌరుడు మీ పరాక్రమాన్ని జరుపుకుంటారు. మేము మా పిల్లలను మీలాగే పెంచాలనుకుంటున్నాము. భారత సైన్యానికి ఇది సముచితమైన నివాళి. జై హింద్, దయచేసి ఈ సినిమాను ప్రేక్షకులు మిస్ అవ్వకండి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా అమరన్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.


Read More..

Alia Bhatt: ‘ఆ విషయంలో మేం ఇప్పటికి క్లారిటీగా ఉన్నాం’ కుమార్తెపై అలియా షాకింగ్ కామెంట్స్..

Advertisement

Next Story