క్రిప్టోలో 'హాట్ Vs కోల్డ్' వాలెట్స్.. ఏది బెటర్!

by Web Desk |
క్రిప్టోలో హాట్ Vs కోల్డ్ వాలెట్స్.. ఏది బెటర్!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ హవా నడుస్తోంది. ఇప్పుడు మీరు కొనుగోలు చేసిన క్రిప్టోను ఎక్స్‌చేంజ్‌లో స్టోర్ చేయడం సులభమైన మార్గం. కానీ మరింత సురక్షిత ఎంపికను పొందాలనుకునే వారికి, క్రిప్టోకరెన్సీ వాలెట్స్ మరింత రక్షణ అందిస్తున్నాయి. వాలెట్‌ను ఉపయోగించడం కొంచెం క్లిష్టమే అయినా, కొంతమంది పెట్టుబడిదారులను ఇది హ్యాకర్ల నుంచి కాపాడుతుంది. ప్రస్తుతం క్రిప్టో వాలెట్స్‌లో 'కోల్డ్, హాట్' పేరుతో రెండు రకాలుండగా.. ఎందులో పెడితే మనం సేఫ్‌గా ఉండవచ్చో తెలుసుకుందాం.

క్రిప్టో నాణేలు నిల్వ చేసేందుకు చాలా మార్గాలున్నాయి. కాయిన్‌బేస్(Coinbase), పేపాల్ వంటి ఆన్‌లైన్ ఎక్స్‌చేంజ్‌లు యూజర్ల టోకెన్స్‌ను తమ కస్టడీలోనే నిల్వచేస్తాయి. అయితే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానమున్నవారు ఇలాంటి మధ్యవర్తిని తొలగించి, వ్యక్తిగతంగా హార్డ్‌వేర్ వాలెట్స్‌లో తమ క్రిప్టో నగదును భద్రపరుచుకోవచ్చు. ఇక ట్రెజర్ లేదా లెడ్జర్ వంటి థంబ్ డ్రైవ్-సైజ్ పరికరాలు కూడా క్రిప్టో టోకెన్స్‌ను సురక్షితంగా ఉంచగలిగే ఒక మార్గాన్ని అందిస్తాయి. ఇక 'స్క్వేర్' కూడా హార్డ్‌వేర్ వాలెట్ అండ్ సర్వీస్ అందిస్తోంది. ఈ మేరకు క్రిప్టోకరెన్సీ కలిగిన వ్యక్తులు 'హాట్'/'కోల్డ్' స్టోరేజ్ లేదా రెండింటి కలయికలో బిట్‌కాయిన్స్ రూపంలో స్టోర్ చేయొచ్చు. హాట్ వాలెట్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడంతో పాటు యజమానులకు నాణేలను సులభంగా యాక్సెస్ చేసే వీలుకల్పిస్తుంది. తద్వారా వారు తమ క్రిప్టోను యాక్సెస్ చేసి, వాటిని ఖర్చు చేయొచ్చు.

ఇక కోల్డ్ స్టోరేజీ అత్యంత ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది. ఇందుకోసం ఒక ప్రైవేట్ కీ పొందుతారు. క్రిప్టోను వాలెట్ నుంచి మూవ్ చేసేందుకు పాస్‌వర్డ్‌తో కూడిన ప్రైవేట్ కీ తప్పనిసరి. ఇవి ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన కంప్యూటర్స్‌లో నిల్వ చేయబడనందున హ్యాకర్లు వీటిని హ్యాక్ చేయలేరు. అందువల్లే తమ కస్టమర్స్ డిపాజిట్ చేసిన క్రిప్టోను భద్రపరిచేందుకు ఎక్స్‌చేంజ్‌లు తరచుగా కోల్డ్ వాలెట్స్ ఉపయోగిస్తాయి. అయితే ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడటం వల్ల హాట్ వాలెట్లలో సేఫ్టీ తక్కువని సైబర్ నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed