పరీక్షల్లో ఫెయిల్‌.. మనస్థాపంతో ఇంటర్ ​విద్యార్థిని ఆత్మహత్య

by Aamani |
పరీక్షల్లో ఫెయిల్‌.. మనస్థాపంతో ఇంటర్ ​విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వనస్థలిపురం: ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలైన గంటల వ్యవధిలోనే పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానన్న మనస్థాపంతో నాగోల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో మంగళవారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగోల్ ​ఇన్​స్పెక్టర్ ​సూర్య నాయక్​ వివరాల ప్రకారం.. నాగోల్​ పరిధిలోని తట్టి అన్నారం వైఎస్సార్​కాలనీకి సుక్క రవి కుమార్​కుమార్తె సుక్క అరుంధతి (17) కొత్తపేటలోని నారాయణ కాలేజీలో బైపీసీ ఇంటర్​ఫస్టియర్​చదువుతోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో చూసుకోగా బాటనీ సబ్జెక్ట్​లో ఫెయిలైంది.

దీంతో తీవ్ర మనస్థాపం చెందిన అరుంధతి .. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి గదిలో పై కప్పుకు అమర్చిన ఇనుప రాడుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కిందికి దించి స్థానికంగా ఉన్న సుప్రజ హాస్పిటల్​కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. తన చెల్లి పరీక్షలో ఫెయిలైనందుకే మనస్థాపం చెంది సూసైడ్​చేసుకుందని, ఆమె ఆత్మహత్య పై ఎలాంటి అనుమానాలు లేవని అరుంధతి అన్న గౌతమ్​పోలీసులకు తెలిపారు. గౌతమ్​కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్య నాయక్​ తెలిపారు.


Next Story

Most Viewed