Alarm tips: అలారంతో మైండ్ డిస్టర్బ్.. ప్రశాంతత కోసం ఈ టిప్స్ పాటిస్తే చాలు..!!

by Anjali |   ( Updated:2024-11-03 10:52:00.0  )
Alarm tips: అలారంతో మైండ్ డిస్టర్బ్..  ప్రశాంతత కోసం ఈ టిప్స్ పాటిస్తే చాలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది నైట్ లేట్‌గా పడుకోవడం.. మార్నింగ్ (Morning) ఆలస్యంగా లేవడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఉదయం కాస్త తొందరగానే నిద్రలేవాలని అనుకుంటారు. కానీ పలు కారణాల వల్ల లేవలేకపోతారు. దీంతో చాలా మంది అలారం పెట్టుకుని నిద్రలేస్తారు. రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసుకుంటారు. ఇక మార్నింగ్ అలారం(alarm) వినిపించగానే నిద్రలోనే ఉలిక్కిపడి లేస్తుంటారు. దీంతో డే మొత్తం మైండ్ (Mind) కంగారుగా, ఆందోళన ఉన్న భావన కలుగుతుంది. మూడ్ మొత్తం చెడిపోతుంది. అయితే పలు టిప్స్ పాటిస్తే కనుక పాజిటివ్ ఎనర్జీ (Positive energy) పెరుగుతుందని.. తద్వారా ప్రశాంతంగా నిద్ర లేవొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉదయం పూట ప్రశాంతంగా నిద్ర లేవాలంటే అలారం టోన్ (Alarm tone) ను సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రశాంతమైన శబ్దంతో ఉండే టోన్‌ను సెట్ చేసుకోవడం మేలు. కాగా ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ (Music) లేదా పాటను అలారంగా పెట్టుకుంటే డే మొత్తం మీ మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఫీల్ గుడ్ అనిపిస్తుంది. అలాగే అలారం టోన్ ‌గా మీరు పాటించే మతానికి సంబంధించిన ఆధ్మాత్మిక సంగీతాన్ని లేదా సాంగ్ ను అలారంగా పెట్టుకోండి. దీంతో మీకు ఇష్టమైన సౌండ్ చెవులకు చేరినప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది అలారం మొగుతుంటే స్నూజ్ (Snooze) చేస్తూ అలాగే పడుకుంటుంటారు. పక్కనే ఉండే మళ్లీ మళ్లీ ఆఫ్ చేసి పడుకుంటారు. కాగా కాస్త దూరంగా పెట్టండి. నడిచి అక్కడికెళ్లి అల్లారం స్నూజ్ చేయడానికి వెళ్లాల్సి వస్తుంది దీంతో నిద్రలో నుంచి బయటికి వస్తారు. ఎలాగు లేచాం కదా అని మళ్లీ పడుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Read More..

Strange Places : అక్కడ మనుషులు జీవించలేరు కానీ..

Advertisement

Next Story

Most Viewed