మద్యం అమ్మకాలు జగన్ పదో రత్నం: టీడీపీ నేత వంగలపూడి అనిత

by Harish |
మద్యం అమ్మకాలు జగన్ పదో రత్నం: టీడీపీ నేత వంగలపూడి అనిత
X

దిశ, ఏపీ బ్యూరో: కల్తీసారా, జేబ్రాండ్ల మద్యం అమ్మకాలు సీఎం జగన్ రెడ్డి అమలు చేస్తున్న పదో రత్నం అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ పదో రత్నమే రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలన్నింటికీ కారణమని మండిపడ్డారు. ఉత్తుత్తి 'దిశ'యాప్‌‌తో మహిళల మానప్రాణాలు ఎంత వరకు కాపాడాడో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాటుసారా, కల్తీ మద్యం, డ్రగ్స్ లాంటి వాటిని అరికట్టకుండా రాష్ట్రంలో మహిళా భద్రత ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.

Next Story

Most Viewed