- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR పై కేంద్ర మంత్రి ప్రసంశలు.. అలాంటి సినిమా అంటూ..
దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి రోజే థియేటర్ల దగ్గర జాతర్లు జరిగాయి. ఈ సినిమా మొదటి వారంలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. రెండో వారానికి దాదాపు రూ.750 కోట్లు సంపాదించింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' హవా నడుస్తూనే ఉంది.
అయితే తాజాగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ ఘోయల్ 'ఆర్ఆర్ఆర్' మూవీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో బిగ్గెస్ట్ మూవీ 'ఆర్ఆర్ఆర్' అని, దేశంలో తన కలెక్షన్లతోనే రికార్డులు సృష్టిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్లు రాబడుతుందని చెప్పుకొచ్చారు. 'రూ.750 కలెక్షన్లతో 'ఆర్ఆర్ఆర్' భారతదేశంలోని అతి పెద్ద సినిమాగా నిలిచింది' అని ఆయన అన్నారు. అచ్చం 'ఆర్ఆర్ఆర్' సినిమాను తలపించేలా భారత ఎకానమీ కూడా వరుస రికార్డులను బద్దలు కొడుతోందని, భారత వస్తువుల ఎగుమతులు 2021-2022 ఏడాదుల్లో 418 బిలియన్ డాలర్లు పెరిగాయని ఆయన తెలిపారు.