Twitter యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో 'ఎడిట్' ఫీచర్?

by samatah |   ( Updated:2022-05-04 10:48:20.0  )
Twitter యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఎడిట్ ఫీచర్?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్.. యూజర్లకు గుడ్‌ న్యూస్ చెప్పింది. రాబోయే నెలల్లో 'ఎడిట్' ఫీచర్‌ను టెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు ట్విట్టర్ కమ్యూనికేషన్స్ టీమ్ తాజాగా పోస్ట్ చేసింది. వినియోగదారుల సౌలభ్యం, ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్లను పరిగణలోకి ఈ దిశగా శ్రీకారం చుట్టింది.

ఇప్పటివరకు మనం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌‌ను ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు. దీంతో 'ఎడిట్' బటన్ ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా మెజారిటీ యూజర్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన ట్విట్టర్.. ఇప్పటికీ ఎడిట్ ఫీచర్‌ తీసుకురాకపోవడానికి ఓ కారణముంది. అదేంటంటే.. సాధారణంగా ఎవరికైనా మెసేజ్ సెండ్ చేశామంటే దాన్ని మళ్లీ ఎడిట్, డిలీట్ చేసే అవకాశం ఉండదు. అదే విధంగా ట్విట్టర్‌‌లోనూ ఒకసారి పోస్ట్ చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకునేందుకు చాన్స్ ఉండకూడదని మాజీ సీఈవో జాక్ డోర్సె అభిప్రాయం. కానీ ఏదో ఒక టైమ్‌లో ఇలాంటి ఫీచర్ తీసుకురావాల్సిన అవసరం ఉండటంతో ప్రస్తుతం ప్రవేశపెడుతోంది.

ఎడిట్ ఫీచర్‌ను సురక్షితమైన పద్ధతిలో ఎలా నిర్మించాలో అన్వేషిస్తున్నాం. అయితే ఎడిట్ బటన్‌ను చేర్చినప్పుడు పబ్లిక్ సంభాషణకు సంబంధించిన సమగ్రతను రక్షించాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీనికి సమయం పడుతుంది. ఎడిట్ బటన్ ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.

- జే సుల్లివన్, ట్విట్టర్‌ ప్రొడక్టివ్ హెడ్

Advertisement

Next Story