వరంగల్‌లో ఎయిర్ పోర్టుపై బయటపడ్డ కేసీఆర్ గేమ్.. నెటిజన్ ట్వీట్ వైరల్

by Nagaya |
వరంగల్‌లో ఎయిర్ పోర్టుపై బయటపడ్డ కేసీఆర్ గేమ్.. నెటిజన్ ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటు ముందుకు సాగడం లేదు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులకు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పెద్ద అస్త్రంగా మారింది. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యిందని.. ముందుగా కార్గో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పుకొచ్చారు. అయితే, విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్.. ఎయిర్ పోర్ట్ ఏర్పాటులో ఆలస్యానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేశారు. దీనికి ఏఏఐ ఇచ్చిన రిప్లైను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

''వరంగల్ నగరంలో కానీ, తెలంగాణలో ఇతర విమానశ్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కానీ, వాస్తవానికి వరంగల్ విమానాశ్రయం క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేయలేదని, ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆర్టీఐలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీంతో తెలంగాణలోని ఎయిర్ పోర్టుల ఏర్పాటులో రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story