వయసు మీద పడుతోందా.. బ్రెస్ట్ బిగుతుగా, అందంగా ఉండేందుకు పాటించాల్సిన టిప్స్..?

by Anjali |
వయసు మీద పడుతోందా.. బ్రెస్ట్ బిగుతుగా, అందంగా ఉండేందుకు పాటించాల్సిన టిప్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది ఆడవాళ్లు అందంపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఫేస్ పై గానీ.. బాడీ ఫిట్ నెస్‌(Body fitness)పై గానీ మరింత శ్రద్ధ చూపుతారు. పలు పార్టీలకెళ్తే నలుగురిలో వారు హైలెట్‌గా నిలవాలని కోరుకుంటారు. కాగా మేకప్, లిప్‌స్టిక్(Lipstick) లు, డ్రెస్సింగ్ విధానంలో బాగా కేర్ తీసుకుంటార. వీటితో పాటు ఆడవాళ్లు రొమ్ము పరిణామం, షేపు కరెక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. చెస్ట్ వదులుగా, జారిపోతున్నట్లుగా ఉంటే మహిళలు నలుగురిలో చాలా ఇబ్బంది పడుతుంటారు.

ముఖ్యంగా మహిళలు శరీర బరువు కారణంగా.. అలాగే గర్భధారణ వంటి సమయాల్లో బాడీలో జరిగిన మార్పుల వల్ల చెస్ట్ సాగిపోతుంటుంది. తద్వారా చూడానికి కాస్త అందవిహీనంగా కనపిస్తుంది. దీంతో ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసం, ఆత్మన్యూనత భావ తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కాగా మహిళల రొమ్ములు ఎల్లప్పుడూ బిగుతుగా, అందంగా ఉండాలంటే నిపుణులు చెప్పిన ఈ విషయాలు తెలుసుకుందాం..

చెస్ట్ ఎప్పుడు బిగుతుగా, అందంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా విటమిన్-సీ, పోషకాలు ఫైబర్ అధికంగా, ఫైటోఈస్ట్రోజెన్లు(Phytoestrogens), ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. చిక్కుళ్లు, గింజలు, కొవ్వు చేపలు వంటి రొమ్ము కణజాలాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చర్మారోగ్యాన్ని పెంచే కోల్లాజెన్ ఉత్పత్తి(Collagen production)ని కూడా ప్రోత్సహిస్తాయి.

అలాగే చెస్ట్ వ్యాయామాలు(Chest exercises) కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డంబెల్ ఫ్లైలు పుష్-అప్స్ ప్రెస్‌లు వంటి చెస్ట్ వ్యాయామాలు చేయాలని దీంతో బ్రెస్ట్ కింద కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. కొవ్వు, చిక్కుళ్లు((Beans), గింజల (nuts), వంటివి చెస్ట్ కణజాలాల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయాలి.

బ్రెస్ట్ చుట్టూ షియా బటర్ కొబ్బరి ఆయిల్ వంటివి అప్లై చేయాలి. దీంతో స్కిన్ బిగుతుగా మారుతుంది. వీటితో పాటుగా బాడీకి మంచి హైడ్రేషన్ అవసరం. కాగా వాటర్ ఎక్కువగా తాగాలి. ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. అప్పుడప్పుడు బ్రెస్టులకు సాఫీగా, సున్నితంగా మసాజ్(Massage) చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టిప్స్ పాటిస్తే.. రొమ్ములు బిగుతుగా, అందంగా తయారవుతాయని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story