కాసేపట్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బెట్టింగ్ బాబులు

by GSrikanth |
కాసేపట్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బెట్టింగ్ బాబులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2022) కాసేపట్లో ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ అంతా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్‌తో పాటు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో మ్యాచులు జరుగనున్నాయి. అయితే తొలి మ్యాచ్ మాత్రం ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరుగనున్నది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్టేడియం.. భారత్‌కు 2011 లో ప్రపంచకప్‌ను అందించింది. ఇదిలా ఉండగా, ఐపీఎల్ కోసం క్రీడాభిమానులే కాకుండా బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఆశలతో ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

ఈ సీజన్‌లో ఎలాగైనా అవకాశం ఉన్న మేరకు సంపాదించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ నగరాల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగనున్నట్లు సమాచారం. మ్యాచ్ వీక్షించేప్పుడు మత్తులో తేలియాడుతూ.. కేవలం బెట్టింగ్‌కే పరిమితం కాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బార్లు, పబ్‌లే లక్ష్యంగా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే, ఈ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి రెండు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story