- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RRR మూవీకి స్పందన కరువు
దిశ, ప్రతినిధి, కరీంనగర్: చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వెండితెరపైకి ఎక్కి సంచలనాలు క్రియేట్ చేస్తుందని భావించినప్పటికీ కరీంనగర్ జిల్లాలో మాత్రం సానుకూల స్పందన రాలేదు. జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని థియేటర్లను ఆదరించే ప్రేక్షకులు లేకుండా పోయారు. దీంతో కిటకిటలాడాల్సిన థియేటర్లు ప్రేక్షకులు లేక వెలితిగా కనిపించాయి. వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించే జక్కన దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రాన్ని తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు కుమ్రం భీం, అల్లూరి సీతారామారావుల చరిత్ర నేపథ్యాన్ని అందిపుచ్చుకుని తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీకి విపరీతమైన క్రేజ్ వస్తోందని సినిమా యూనిట్ కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. కరోనా కారణంగా విడుదలకు ఆలస్యం అయిన ట్రిపుల్ ఆర్ తెరంగ్రేట్రం చేసిన తర్వాత ప్రేక్షకుల నిరాదరణకు గురికావడం నిరుత్సాహ పరుస్తోంది.
అదే కారణమా..?
అయితే ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని హుజురాబాద్ ప్రాంత ప్రేక్షకులు ఆదరించకపోవడానికి కారణం టికెట్ల ధరలు పెరగడమేనని అంటున్నారు. బాల్కనీ టికెట్ ధర రూ. 230కి పెరగడంతో సినిమా చూసేందుకు సగటు ప్రేక్షకుడు ఉత్సాహం చూపడం లేదు. ఓ కుటుంబం అంతా కలిసి సినిమా చూస్తే టికెట్లకే రూ. వెయ్యి వరకు వెచ్చించాల్సి వస్తోందని, స్నాక్స్, కూల్ డ్రింక్ ఖర్చులకు అదనంగా మరో వెయ్యి వరకు సమర్పించాల్సి వస్తుందని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సి కేటగిరి థియేటర్లలో కూడా టికెట్ల ధరలు పెంచడమే ఇందుకు కారణమని అంటున్నారు.
కరీంనగర్ లో గొడవ..
మరో వైపున కరీంనగర్ లోని ఓ థియేటర్ లో సీట్లు చినిగిపోయాయని ప్రేక్షకులపై దాడి చేశారు. థియేటర్ యాజమాన్యం కావాలనే తమపై దాడి చేసిందని ప్రేక్షకులు ఆందోళన చేశారు. ఈ సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు థియేటర్ వద్దకు వచ్చి గొడవను సద్దు మణిగేలా చేశారు. అయితే థియేటర్ యాజమాన్యం తమపై అకారణంగా చేయి చేసుకుందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.