- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కీచక టీచర్.. బాలికలతో అసభ్య ప్రవర్తన.. ఫోన్‌లో మొత్తం వారి నగ్న దృశ్యాలే..
దిశ, అమీన్ పూర్: పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు. విద్యార్థులను ప్రయోజకులను చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడే.. ట్యూషన్‌కు వచ్చే అభం శుభం తెలియని బాలికలపై వికృత చేష్టలకు పాల్పడి.. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తీసుకొచ్చాడు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తంగి గ్రామం సాయి ప్రియ కాలనీలో ఓ వికలాంగ వ్యక్తి (52) నివాసం ఉంటున్నాడు. అయితే, కరోనా ప్రారంభం నుండి ట్యూషన్‌లు చెప్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కీచక టీచర్ తన వద్దకు ట్యూషన్‌కు వస్తున్న అభం శుభం తెలియని మనమరాళ్ల వయసుండే చిన్నారి బాలికలపై వికృత చేష్టలకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.
గత కొంత కాలంగా ఇదే తంతు కొనసాగుతుండటంతో.. ఓ చిన్నారి తమ తల్లి తండ్రులతో ఆయన వెకిలి చేష్టల గురించి చెప్పింది. వెంటనే అప్రమత్తమైన విద్యార్థి తల్లి తండ్రులు ట్యూషన్ మాస్టర్‌ను నిలదీయడంతో పాటు.. అతడి చరవాణిని పరిశీలించగా నగ్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. దీంతో కోపోద్రిక్తులైన పిల్లల తల్లి దండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పటాన్‌చెరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా కొట్టడంతో గాయపడిన అతడిని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.