- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడుకు.. అధికారులతో కలిసి చెక్కుల పంపిణీ
దిశ, మెట్‌పల్లి: అధికార కార్యక్రమంలో తహసీల్దార్ సమక్షంలోనే అనధికార నేతలు చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమం జగిత్యాల జిల్లాలో చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే... ఇబ్రహీంపట్నం మండలం పలు గ్రామాల్లో పర్యటించిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు రైతుబీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేగాక, మండలంలోని ఫకీర్ కొండాపూర్, తిమ్మాపూర్, వేములకుర్తి, ఎర్దండి, అమ్మకపేట డబ్బా, కమలనగర్, గ్రామాల్లో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ మహేశ్వర్, ఆర్ఐ సమక్షంలో ఎమ్మెల్యే తనయుడు చెక్కులను పంపిణీ చేశాడు. అయితే, అధికార కార్యక్రమంలో అనధికార నేతతో కార్యక్రమం జరపడం ఏంటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్ దగ్గరుండి అనధికార నేతతో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.