- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో ఐదు రాష్ట్రాల ఫలితాలు.. అభ్యర్థులను రిసార్ట్‌కు తరలించిన కాంగ్రెస్
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే సంబంధిత అధికారులు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, పంజాబ్‌లో ఆప్, యూపీ, ఉత్తరఖండ్, మణిపూర్‌లో బీజేపీ, గోవాలో కాంగ్రెస్ గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. దీంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంబురాలకు సిద్ధమయ్యారు. కాగా, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలు తలెత్తడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. ముఖ్యంగా.. దేశ ప్రజలంతా చూపు యూపీ ఫలితాలపైనే పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ గెలవబోతోందనేది ఆసక్తి రేపుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారనేది తెలుసుకునేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను అధిష్టానం రిసార్ట్‌లకు తరలించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఫలితాలు ప్రారంభం కానున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కర్ఫ్యూ విధించి, మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.