మోహన్ బాబు ఆహ్వానం మేరకే వెళ్లా: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని

by Disha Desk |
మోహన్ బాబు ఆహ్వానం మేరకే వెళ్లా: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని
X

దిశ, ఏపీ బ్యూరో : అగ్రనటుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. స్నేహ పూర్వకంగానే మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు. మంచు మోహన్ బాబుతో తనకు 2002 నుంచి పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరపున సంజాయిషీ ఇచ్చేందుకు వెళ్లానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరపున ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. తాను చెప్పిన తర్వాతే మంచు విష్ణు తన ట్వీట్‌ను అప్డేట్ చేశారని పేర్కొన్నారు.

మోహన్ బాబుతో విద్యాసంస్థలు, ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్‌తో గురువారం జరిగిన చర్చలకు సీఎంవో నుంచి తనకు ఆహ్వానం అందలేదని ఒకవేళ అంది ఉంటే తప్పకుండా వచ్చేవాడినని మోహన్ బాబు చెప్పారని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ మాత్రం విమర్శలు చేస్తోందంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీ మధ్య చర్చలు సక్సెస్ అవ్వడం తో చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమ సంక్షేమం కోసం ఏనాడు పాటుపడని వ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు మాటల్లో ఈర్ష్య తప్ప మరొకటి కనిపించడం లేదని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed