వేటగాడి ఉచ్చుకు మరో వేటగాడు బలి

by Vinod kumar |
వేటగాడి ఉచ్చుకు మరో వేటగాడు బలి
X

దిశ, కొత్తగూడెం: అడవి జంతువులను వేటాడడానికి అమర్చిన ఉచ్చుకు మరో వేటగాడి ప్రాణం తీసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గద్దల మడుగులో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పెనుబల్లి గద్దల మడుగు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది అడవి జంతువులను వేటాడడం కోసం కరెంటు తీగలతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఉచ్చును ఏర్పాటు చేశారు. కొత్తగూడెం రుద్రంపూర్ కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు అలవాటుగా అదే అడవిలోకి తమ వద్ద ఉన్న గన్ తో అడవి జంతువుల వేటకి బయలుదేరారు.


స్థానికులు అమర్చిన ఉచ్చు ను గమనించని వేటగాడు జంతువుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి మల్లెల సునీల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సునీల్ తో పాటు వేటకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు ఏమి చేయాలో పాలుపోక.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహం కనబడక పోవడం తో గాలింపు చర్యలు చేపట్టారు. కరెంట్ తీగతో ఉచ్చులు వేసిన వ్యక్తులే మృతదేహాన్ని మాయం చేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story