Corona New Variant: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం

by Satheesh |   ( Updated:2022-04-06 14:05:13.0  )
Corona New Variant: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోన కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గు ముఖం పడుతుంది. కరోనా ఆంక్షల నుండి బయట పడుతున్న ప్రజలపై మరోసారి కొత్త రూపంలో కరోనా దాడి చేస్తోంది. తాజాగా భారత్‌కు కరోనా కొత్త వేరియంట్ ఎంటర్ అయింది. ముంబైలో కరోనా కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదయ్యింది. దీంతో కేంద్ర వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈ XE వేరియంట్‌ను మొదట యూకేలో జనవరి 19న గుర్తించారు.

Advertisement

Next Story