Shocking: ఇంకా కొనసాగుతున్న సాయంత్రం 4 గంటలకు ముగియాల్సిన ఎగ్జామ్

by Gantepaka Srikanth |
Shocking: ఇంకా కొనసాగుతున్న సాయంత్రం 4 గంటలకు ముగియాల్సిన ఎగ్జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌(Shamshabad)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటలకు ముగియాల్సిన టెట్ ఎగ్జామ్(TET Exam) రాత్రి 7:30 గంటలు దాటినా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ(Vardhaman Engineering College) కేంద్రంలో నిర్వహించిన టెట్ పరీక్షలో గందరగోళం ఏర్పడింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాదాపు 150 మంది అభ్యర్థుల పరీక్ష నిలిచిపోయింది. దీంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు చాలాసేపు కష్టపడి.. సమస్యను సరిచేశారు. అనంతరం పరీక్షను మళ్లీ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story