పెండింగ్ చలాన్ల డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

by Mahesh |
పెండింగ్ చలాన్ల డిస్కౌంట్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: రోడ్డు భద్రత, వాహనాల నియమ నిబంధనలు, లాక్ డౌన్ నిబంధనలు మొదలగు ప్రభుత్వ ఆదేశాలను విస్మరించిన వారిపై పోలీస్ వారిచే వేయబడిన చలానాలు చెల్లించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాయితీలు కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపినారు. కరోనా కష్ట కాలంలో చిన్నాభిన్నమై చిన్న మధ్యతరగతి వాహనదారులకు, ఇతరులకు ప్రభుత్వం ఈ అవకాశం కలిగించినది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు - 75%, RTC బస్ -70%, కార్లు- 50%, తోపుడుబండ్లు - 80 %, విత్ అవుట్ మాస్క్ - 90% రాయితీ ఇచ్చారు.

కావున ఇట్టి అవకాశాన్ని ప్రజలు, వాహనదారులు ఉపయోగించుకొని మార్చి 31 వ తారీఖు లోపు మీ వాహనం పై పెండింగ్ లో ఉన్న చలనాలను చెళ్ళించగలరని ఎస్పీ కోరారు. రోడ్డు భద్రత రక్షణ కోసమే చలాన్ విధించడం జరుగుతుందని అన్నారు. చలాన్ చెల్లించడానికి ఈ లింక్ ద్వారా https://echallan.tspolice.gov.in/publicview ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ అవకాశం కల్పించింది. రోడ్లపై జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఆశిస్తున్నాము అని సూర్యాపేట ఎస్పీ ఎస్. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed