Kanguva: సూర్య ‘కంగువా’ రెండు రోజుల్లో ఎంత ఎంతంటే..?

by Prasanna |
Kanguva: సూర్య ‘కంగువా’ రెండు రోజుల్లో ఎంత ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సినిమా ‘కంగువ’ ( Kanguva ) ఈ మూవీ నవంబర్ 14 న థియేటర్లలో రిలీజ్ అయింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకం పై శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుత కాలానికి పునర్జన్మను గుర్తు చేస్త కంగువ సినిమాని నిర్మించారు. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్, హీరోయిన్ దిశా పటాని, యోగి బాబు.. ముఖ్య పాత్రలు పోషించారు.

కంగువా మూవీని ప్రేక్షకులు బాగానే అలరిస్తున్నారు. కొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ నడుస్తున్నా కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. కంగువా మూవీ నుంచి మొదటి రోజు రూ. 58 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండు రోజుల్లో రూ. 89.32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు ఆదివారం కాబట్టి కలిసి రావడంతో రూ. 100 కోట్లు ఈజీగా దాటేస్తుందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

ఇక కంగువా మూవీ క్లైమాక్స్ లో హీరో కార్తీ తో ఓ స్పెషల్ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చి అందర్నీ సర్ ప్రైజ్ చేసారు. మరి, పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Advertisement

Next Story