- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మే 1 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మే 1 నుంచి వేసవి శిక్షణా శిబిరాలను ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి క్యాంపు ఆఫీస్‌లో వేసవి శిక్షణా శిబిరాలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి మే 31 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్నీ క్రీడా స్టేడియమ్స్‌లలో, మే 1 నుంచి 31 వరకు మిగతా అన్నీ జిల్లాలో శిబిరాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఇందుకు అవసరమైన నిధులను సాట్స్‌కు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలలో, గ్రేటర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం (యూసుఫ్ గూడ), సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్, సరూర్ నగర్ స్టేడియం సైకింగ్ వెల్ డోమ్ (ఓయూ), ఎల్బీ స్టేడియంలో ఆయా క్రీడాంశాల్లో ఈ వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ అధికారులు గోకుల్, డాక్టర్ రవికుమార్, మనోహర్ గౌడ్, వెంకటేశ్వరరావు, నిరంజన్ రెడ్డి, నరేందర్, నూక సత్యనారాయణ పాల్గొన్నారు.