- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sugarcane juice: చెరుకు రసం-కొబ్బరి వాటర్.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏవి మంచివి?

దిశ, వెబ్‌డెస్క్: చెరుకు రసం (Sugarcane juice) తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants), విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. కాగా చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణక్రియ (digestion)ను సులభతరం చేయడంలో మేలు చేస్తుంది. వీటితో పాటుగా కామెర్లకు నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో మేలు చేస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు (Hemoglobin levels) పెరుగుతాయి. జ్వరం బారిన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతూనే ఉంటారు. మూత్రసంబంధ సమస్యలను చెరకు రసం పరిష్కరిస్తుంది. దీనిలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి.
కానీ డయాబెటిస్ ఉన్నవారు అప్పుడప్పుడు మాత్రమే చెరుకు రసం తాగడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ (Sugar levels) పెరుగుతాయని అంటున్నారు. మరీ వేసవిలో ఇన్ని ప్రయోజనాలున్న చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి మంచిదా? లేదా కొబ్బరి వాటర్ తాగితే మేలా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆర్ద్రీకరణను అందించడమే కాకుండా.. వెయిట్ లాస్ అయ్యేందుకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి (heart health) మేలు చేస్తుంది.
అంతేకాకుండా.. అధిక రక్తపోటు (high blood pressure)ను తగ్గించడానికి, మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి, మధుమేహాన్ని నిర్వహించడానికి, అలసట, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కొబ్బరి వాటర్ మంచి మూలం అని నిపుణులు చెబుతుంటారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నీళ్లలోని పోషకాలు పొటాషియం, మెగ్నీషియం (high blood pressure...), కాల్షియం, సోడియం. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది.
మరీ ఈ రెండింటిలో వేసవిలో ఏవి తాగితే మేలో ఇప్పుడు తెలుసుకుందాం.. చెరకు రసంలో షుగర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాగా షుగర్ లెవల్స్ (Sugar levels) పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పెషేంట్లకైతే తాగితే ప్రమాదమే అని చెప్పుకోవచ్చు. దీనికి బదులుగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కొకనట్ వాటర్ తాగితే బెటర్. కానీ కొబ్బరి నీళ్లు తాగే ముందు ఒకవేళ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(Kidney disease) ఉండే లేకపోతే మూత్రపిండాల్లో స్టోన్స్ ఉంటే ఒక్కసారి వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.