- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నో పాములను రక్షించిన స్నేక్ క్యాచర్.. చివరకు పాముకాటుతోనే..
దిశ, మణుగూరు: పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే… మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలోని రిక్షా కాలనీ చెందిన షరీఫ్(34) ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తున్నారు. అయితే షరీఫ్‌కు చిన్నప్పటి నుంచే పాములు పట్టాలనే వృత్తిని ఎంచుకున్నడని స్థానికులు తెలిపారు. ఎక్కడ పాములు కనిపించిన, పాములు సమాచారం వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలేస్తాడాని కొంత సమాచారం. ఈ క్రమంలో మండలంలోని సమితిసింగరం ప్రాంతంలోని ఓ ఇంటి బావిలో త్రాచు పాము ఉందని సమాచారం తెలుసుకొని ఆ పామును పట్టుకున్నాడు.
పట్టుకున్న పాముతో షరీఫ్ నడిరోడ్డుపై ఆటలాడాడు. ఆటలాడుతున్న క్రమంలో పాము షరీఫ్ కుడి చేతిపై కాటు వేసిందని స్థానికులు తెలిపారు. పాము కాటు వేసిన తర్వాత చుట్టుపక్కల స్థానికులు, తన స్నేహితులు ఆసుపత్రికి వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా పామును అడవి ప్రాంతంలో వదిలి వస్తున్న క్రమంలో మండలంలోని సురక్ష బస్టాండ్ వద్ద కుప్పకూలిపోయాడు. వెంటనే షరీఫ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు షరీఫ్ కు వివాహం కాకపోవడం గమనార్హం.