'పఠాన్' నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.. సిద్ధార్థ్

by srinivas |
పఠాన్ నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.. సిద్ధార్థ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. కాగా ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ నటీనటులతో ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కు లభించిన విశేష ఆదరణ సినిమాపై భారీ అంచాలు పెంచిందని, తన కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. 'ప్రస్తుతం నా లైఫ్‌లోని ప్రతిక్షణాన్ని 'పఠాన్‌'తోనే నడిపిస్తా. ఆ కథతోనే ఊపిరి పీల్చుకుంటున్నా. ఈ మూవీతో మరెవరూ అందించలేని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత వస్తున్న షారుఖ్ లుక్స్ అందరికీ అమితంగా నచ్చడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన దర్శకుడు.. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 జనవరి 25న థియేటర్లలో రిలీజవుతున్న చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నాడు.

Advertisement

Next Story