- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంజీఎం బాధితుడు శ్రీనివాస్ అంత్యక్రియలకు షాకిచ్చిన ఇంటి ఓనర్
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎంజీఎం ఎలుకల బాధితుడు కడార్ల శ్రీనివాస్(37) అంత్యక్రియల్లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు ఇంటి ఓనర్ అనుమతివ్వకపోవడంతో కుటుంబ సభ్యుల తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భీమారం వాస్తవ్యుడైన కడార్ల శ్రీనివాస్ కొన్నేళ్లుగా హన్మకొండ కుమార్‌పల్లిలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలోనే కిడ్నీ సంబంధిత అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం మెరగుపడకపోగా ఆర్థికంగా కుటుంబం చితికి పోయింది. చివరికి ఎంజీఎం ఐసీయూలో జాయిన్ అయి చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేశాయి. అసలే మరణంతో పోరాడుతున్న శ్రీనివాస్ ఎలుకల దాడితో తీవ్ర రక్తసావ్రమై పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే శ్రీనివాస్‌ను నిమ్స్‌కు తరలించింది. అయితే చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించాడు. శనివారం మధ్యాహ్నమే హన్మకొండ అద్దె ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా యజమాని నుంచి నిరాకరణ ఎదురైంది. దీంతో భీమారంలోని శ్రీనివాస్ సోదరుడి ఇంటికి తీసుకెళ్లారు. సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.