- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంగారు పడ్డాడు.. పోలీసులకు పట్టుబడ్డాడు
by Vinod kumar |

X
దిశ, వరంగల్ టౌన్: వరంగల్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద పెద్ద ట్రాలీ బ్యాగులతో ఉన్న వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి కంగారు పడ్డాడు. అది గమనించిన పోలీసులు అతన్ని పట్టుకుని బ్యాగులు తనిఖీ చేయగా సుంకం చెల్లించని 7.50 లీటర్ల 45 బాటిళ్లు లిక్కర్ ఉంది. లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బల్లాపూర్ కు చెందిన గువులోత్ ప్రకాష్ కూలి పనిచేసుకుంటు జీవనం సాగించేవాడు.
వచ్చిన కూలి పైసలు చాలక నిత్యం ట్రెన్ లలో ప్రయాణిస్తూ.. హర్యానాలో మద్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వరంగల్ కు తీసుకు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మకాలు జరుపుతున్నాడు. తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. దీంతో సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ నాగరాజు తెలిపారు.
Next Story