ఆ హీరోయిన్‌తో నా రిలేషన్‌షిప్ ప్రత్యేకం.. Sanjay Dutt

by samatah |   ( Updated:9 April 2022 12:30 PM  )
ఆ హీరోయిన్‌తో నా రిలేషన్‌షిప్ ప్రత్యేకం.. Sanjay Dutt
X

దిశ, సినిమా : మొదటి భాగంతో ఇండియా వైడ్‌గా ప్రభంజనం సృష్టించిన 'కేజీఎఫ్' సెకండ్ పార్ట్ ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో యశ్‌తో పాటు బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ సంజయ్ దత్, రవీనా టాండన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990లలో వెండితెరపై జంటగా అలరించిన ఈ స్టార్స్ చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. కాగా వీరి మధ్యనున్న స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సంజయ్. రవీనా తనకు చాలా సన్నిహితురాలని, తన లైఫ్‌లో ఆమెకు చాలా ఇంపార్టెన్స్ ఉందంటూ ఇద్దరి మధ్యనున్న బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ గురించి రివీల్ చేశాడు. తామిద్దరం ఒకరికొకరం ఎప్పుడూ అండగా ఉంటామని, ఇన్నాళ్ల తర్వాత ఆమెతో కలిసి నటించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలవనుంది.

Next Story

Most Viewed