- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు బరితెగించారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు..
దిశ, వైరా: నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో భాగంగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండు బార్ అండ్ రెస్టారెంట్ ల నిర్వహణకు అధికారికంగా పర్మిషన్ తీసుకొని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రహదారికి పక్కన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న శబరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల తీరు ఆది నుంచి వివాదాలే.
తాజాగా గత రాత్రి బ్రాహ్మణపల్లికి చెందిన గద్వాల రాకేష్ అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు బిర్యానీ తినడం కోసం వెళ్లారు. ఆర్డర్ చేసి ముందుగానే ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. 40 నిమిషాలు దాటినా.. బిర్యాని ఇవ్వకపోవడంతో రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించారు.
దీంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది కాక తమపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటం, ఇదేంటని ప్రశ్నిస్తే.. సిబ్బంది మొత్తం మూకుమ్మడిగా తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ తీసుకునే ముందు బిర్యానీ ఉందని చెప్పి 40 నిమిషాలు గడిచిన తర్వాత లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి పిడి గుద్దులు గుద్దుకుంటూ కర్రలతో విచక్షణారహితంగా తమపై దాడి చేశారని.. దాడిలో గాయపడిన గద్వాల రాకేష్ వివరించాడు.
తనపై దాడి జరుగుతున్న సమయంలో తనతోపాటు ఉన్న తన స్నేహితులు అయిన రవి కుమార్, ప్రకాష్, ప్రేమ్ జి కూడా వదిలిపెట్టకుండా వారిపై కూడా దాడి చేశారని అంతేకాక వారి వద్ద ఉన్నటువంటి నగదు, సెల్ ఫోన్ బైకులు లాక్కొని వీరంగం సృష్టించారని తెలిపాడు. దాడి జరుగుతున్న సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్ స్పెక్టర్ సురేష్ సమక్షంలోనే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు, సిబ్బంది వీరంగం సృష్టించడం పోలీసులే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
రెస్టారెంట్ లో జరుగుతున్న గొడవను చిత్రీకరిస్తున్న కొందరు విలేకరులపై కూడా రెస్టారెంట్ నిర్వాహకులు చిందులు వేశారని కొంతమంది మీడియా ప్రతినిధులు తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులకు కస్టమర్లకు జరుగుతున్న గొడవలు స్థానిక పోలీసులు ఇరు వర్గాలను పంపించడంతో సమస్య సద్దుమణిగింది.
ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులు..
శబరి బార్ అండ్ రెస్టారెంట్ లో గత రాత్రి జరిగిన వివాదంలో రెస్టారెంట్ నందు పనిచేస్తున్న 20 మంది సిబ్బంది పై తనపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచినందుకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గద్వాల రాకేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కూడా రెస్టారెంట్ నందు పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరైన తడకమళ్ళ వంశీ అనే యువకుడిపై గద్వాల రాకేష్ అనే యువకుడు అతని స్నేహితులు దాడి చేసి గాయపరిచారని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
నిబంధనలు తుంగలో తొక్కిన నిర్వాహకులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ నిబంధన మొత్తం ఒకలా అమలవుతుంటే.. వైరాలో మాత్రం ఒక విధంగా అమలు అవుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. నిబంధన ప్రకారం వైన్స్ షాపులు 10 గంటల కల్లా బార్ అండ్ రెస్టారెంట్లు 12:00 కల్లా బందు చేయాల్సిన నియమం ఉన్నప్పటికీ.. ఆ నియమాన్ని తుంగలోతొక్కి నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా అర్ధరాత్రి దాటాక కూడా బార్లు తెరిచి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కూతవేటు దూరంలోనే ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటో అని పలువురు చర్చించుకుంటున్నారు.
నాడు.. నేడు.. అదే తీరు
వైరా మున్సిపాలిటీ లో నూతనంగా ప్రారంభించిన శబరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు తీరు నాటి నుండి నేటి వరకు ఎటువంటి మార్పు రాలేదని గతంలో కూడా రెస్టారెంట్ లోని వ్యర్థ పదార్థాలు మొత్తం సైడ్ డ్రైనేజీ కాలువలో వేస్తున్నారు. దీంతో కేకే టవర్స్ సమీపంలోని ఇళ్ల నిర్మాణం దగ్గర ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం నిలిచిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి.
స్థానిక ఇళ్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంటి యజమానులపై రెస్టారెంట్ నిర్వాహకులు తల్లాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళలను కూలికి తెప్పించి దాడి చేయించేందుకు ప్రయత్నించిన ఘటన లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన కొంతమంది మీడియా మిత్రులపై కూడా దురుసుగా ప్రవర్తించి మహిళలచే దాడి చేయించేందుకు కూడా నిర్వాహకులు వెనుకడుగు వేయలేదు. అంటే ఎవరి అండదండలు ఉన్నాయో మరి.. ఇలాంటి ఘటనలతో నిత్యం వివాదాల నడుమ నడుస్తున్న శబరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.