ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు.. ఆర్టీసీ కార్గో సర్వీసులు

by Vinod kumar |
RTC Cargo Services
X

దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలను నామమాత్రపు చార్జీలతో ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని సంస్థ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​, ఎండీ సజ్జనార్​ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాములోరి కల్యాణం లో వాడే అక్షింతలకు ఎంతో విశిష్టత ఉందని, ఆ తలంబ్రాలను భక్తులు నేరుగా ఇంటికి తెప్పించుకునే సదావకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.


ఆర్టీసీ కార్గో, పార్శిల్ కౌంటర్ లో కేవలం రూ .80 చెల్లిస్తే శ్రీరామ నవమి ఘట్టం ముగిసిన తరువాత ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్ద అందిస్తామన్నారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనిపై వివరాలకు టీఎస్​ఆర్టీసీ కాల్ సెంటర్ నెం. 040-30102829/ 68153333 లేదా కార్గో, పార్శిల్ కౌంటర్లలో సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Next Story