- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు భారీ శుభవార్త.. 350సీసీలో అదిరిపోయే లుక్‌తో న్యూ బైక్..!!
దిశ, వెబ్‌డెస్క్: యూత్ ఎక్కువగా ఇష్టపడే రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైక్‌కు ఇండియా మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గత నెల అక్టోబరు(October)లో ఈ కంపెనీ లక్షకు పైగానే వాహనాలు విక్రయించింది. కాగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తీసుకొస్తుంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్(Enfield) లవర్స్‌కు మరో భారీ శుభవార్త. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350సీసీలో బైక్ లాంచ్ అవ్వనుంది. క్లాసిక్(Classic), మీటియోర్(Meteor), బుల్లెట్ తర్వాత జె-సిరీస్ ఇంజన్ ప్లాట్‌ఫామ్ రిలీజ్ కానుంది. ఇది గోవాన్ క్లాసిక్.. బాబర్ స్టైల్ మోటార్ సైకిల్ మోడల్‌లో క్లాసిక్ 350తో రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ 350సీసీ, జావా 42 బాబర్(Java 42 Babar)లాగా సింగిల్ సీటుతో వస్తుంది.
నవంబర్ 23న లాంచ్ కాబోతున్న ఈ న్యూ మోడల్ బైక్ 20బిహెచ్‌పీ పవర్(20bhp power), 27 ఎన్ఎమ్ టార్క్(27 Nm of torque)ను కలిగి ఉండనుంది. అలాగే ఇది గుండ్రని హెడ్‌ల్యాంప్(Headlamp), వృత్తాకార టెయిల్ ల్యాంప్(Circular tail lamp), ఫార్వర్డ్ సెట్ పుట్ పెగ్‌లు(Forward set put pegs) ఉంటాయి. ఫార్వర్డ్ సెట్ పుట్ పెగ్‌లు, గోవాన్ క్లాసిక్ 350లో ట్యూబ్యులర్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌కు మంచి సస్పెన్షన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ముందు భాగంలో అయితే టెలిస్కోపిక్ ఫోర్క్(Telescopic fork) ఉంటుంది. వెనక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు అమరుస్తారు.170 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఈ ఎన్‌ఫిల్డ్ క్లాసిక్ 350 ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.30 లక్షల మధ్యలో ఉంది.