ముదురుతున్న వడ్ల పంచాయితీ.. కేంద్రానికి ఇచ్చిన లేఖను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

by Mahesh |
ముదురుతున్న వడ్ల పంచాయితీ.. కేంద్రానికి ఇచ్చిన లేఖను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీ ని తాకింది. ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందిని తెలియజేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తెలుగులో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావులు స్పందించి కాంగ్రెస్ పై విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. గత ఏడాది సెప్టెంబర్ 4న ధాన్యం సేకరణ గురించి కేంద్రానికి రాసిన లేఖను పోస్ట్ చేస్తూ '' భవిష్యత్ లో పారా బాయిల్డ్ రైస్‌ను ఎఫ్‌సీఐకి పంపించమని కేంద్రానికి రాసిన లేఖ.. ఇదిగో చూడండి హరీష్..'' అంటూ మండిపడ్డారు. రాష్ట్రం రాసిన లేఖలో భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి పారబాయిల్డ్ రైస్ పంపించమని, రాష్ట్రంలోనే రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తామని రాశారు. అంతేగాకుండా, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ హాల్ లో ఫోటో షూట్ చేయదని, రైతుల కోసం నిఖార్సైన ఉద్యమం చేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story