అతడు 4 ఓవర్లు వేయడం చూసి యావత్ దేశం సంతోషిస్తుంది: రవిశాస్త్రి

by Satheesh |   ( Updated:2022-04-02 11:16:03.0  )
అతడు 4 ఓవర్లు వేయడం చూసి యావత్ దేశం సంతోషిస్తుంది: రవిశాస్త్రి
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై మాజీ కోచ్ రవిశాస్ర్తి మరోసారి ప్రశంసలు కురిపించారు. ఓ ప్రముఖ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. 'టీమిండియాకు దూరమైన కసి పాండ్యలో కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో అతడి ఆట చూసి చాలా సంతోషించాను. జట్టులోకి తిరిగి రావాలనే కసితో చాలా ఏకాగ్రతగా ఆడుతున్నాడు. అతడు పరుగులు చేయాలనే ఆకలితో ఉన్నాడు. పాండ్య నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం చూసి యావత్ దేశం మొత్తం సంతోషిస్తుంది. అతడి లాంటి ఫినిషర్ దొరకడం కష్టం. పాండ్య తన బలాన్ని కనుగొని ఆడుతే.. టీమిండియాకు వరల్డ్ కప్ రావడం ఖాయం' అని అభిప్రాయపడ్డాడు. కాగా, వెన్నుముక గాయంతో పాండ్య జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్య.. టీమిండియాలో చోటుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Advertisement

Next Story