Rashmika Mandanna: యాక్షన్ కింగ్‌తో నటి రొమాన్స్.. పాజిటివ్ రిజల్ట్ రావడంతో

by Manoj |   ( Updated:2022-07-09 09:10:11.0  )
Rashmika Mandanna to star with Tiger Shroff in Karan Johar film
X

దిశ, సినిమా: Rashmika Mandanna to star with Tiger Shroff in Karan Johar film| నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇటీవలే రెండు పెద్ద సినిమాలు పూర్తిచేసిన కన్నడ బ్యూటీ.. అవి రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. విషయానికొస్తే.. బీటౌన్ యాక్షన్ కింగ్ టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ను సెప్టెంబరులో ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే టైగర్‌కు జోడీగా రష్మికను ఎంపిక చేసినట్లు తెలుస్తుండగా.. ఆమె కూడా స్క్రిప్ట్ విని పాజిటివ్‌గా స్పందించినట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ లొకేషన్స్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుండగా.. యాక్షన్‌తో కూడిన అడ్వెంచర్‌తో టైగర్‌ను సరికొత్తగా చూపిస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.

Also Read: 'నాకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటోన్న' బేబమ్మ

Advertisement

Next Story