మహారాజు పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్?

by S Gopi |   ( Updated:2022-07-08 11:00:07.0  )
మహారాజు పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్?
X

దిశ, సినిమా : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా 'RC15' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంతో పాటు పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చెర్రీ.. 'మగధీర' లాంటి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన 'లెజెండ్ ఆఫ్ సుహేల్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా' బుక్ ఆధారంగా.. చిత్రాన్ని తెరకెక్కించేందుకు గతంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా ప్రారంభించారు. కానీ కరోనా కారణంగా బ్రేక్ పడ్డ ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే గతంలో అక్షయ్ కుమార్‌‌ను హీరోగా తీసుకోవాలనుకున్నా.. ఇప్పుడు చెర్రీని ఈ పాత్ర కోసం సంప్రదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో చరణ్.. మహారాజు పాత్రలో కనిపించనుండగా.. దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed