- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీరు దిగజారి బజారుకెక్కినందుకు సిగ్గుగా ఉంది.. నటిపై ఫ్యాన్స్ ఫైర్

దిశ, సినిమా : నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూడ్ పిక్స్‌పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన కామెంట్స్ చేసింది. తాను దుబాయ్ వెళ్లిన కారణంగా ఆలస్యంగా స్పందిస్తున్నట్లు చెప్పిన రాఖీ.. హీరోను అలా చూసిన తర్వాత ప్రశాంతంగా అనిపించిందని చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఇండియాలో ఈ చర్చ హాట్ టాపిక్‌గా మారినందుకు సంతోషంగా ఉన్నానన్న ఆమె.. కెమెరా ముందు నగ్నంగా పోజులిచ్చి, దేశంలోని అమ్మాయిలకు మేలు చేశాడని అభిప్రాయపడింది. ఎందుకంటే బట్టలు లేకుండా రణ్‌వీర్ చాలా అందంగా ఉన్నాడని, ఇలాంటి మరిన్ని ఫొటోషూట్స్‌తో యంగ్ గర్ల్స్‌ను అలరించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రాఖీ ఒపీనియన్‌కు కొంతమంది సపోర్టుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం 'పబ్లిసిటీ కోసం నువ్వు ఏదైనా చేస్తావని తెలుసు? కానీ, మేము అభిమానించే నటీనటులు మరీ ఇంతలా దిగజారి బజారుకెక్కినందుకు సిగ్గేస్తుంది' అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.