స్కిన్‌ షో చేయకపోతే ఇండస్ట్రీలో నిలబడలేం.. బోల్డ్ బేబీ

by samatah |
స్కిన్‌ షో చేయకపోతే ఇండస్ట్రీలో నిలబడలేం.. బోల్డ్ బేబీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ కాంట్రవర్షియల్ స్టార్ ఇకపై బుద్దిగా ఉంటానంటోంది. ఎలాంటి చిల్లర పనుల్లో జోక్యం చేసుకోకుండా.. ప్రియుడి ఇష్టప్రకారమే జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. మాజీ భర్తతో విడాకులైన కొంతకాలనికే అదిల్‌ దురానీతో డేటింగ్ మొదలుపెట్టగా.. పెళ్లికి ముందే ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు అదిల్. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఆమెకు ఓ షరతు పెట్టి షాకిచ్చాడు కొత్త ప్రియుడు. ఈ మేరకు ఎక్స్‌పోజింగ్‌ ఉండే బట్టలు వేసుకోవద్దని, శరీరాన్ని వీలైనంతవరకు కప్పి ఉంచే బట్టలనే ధరించాలని చెప్పాడు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన నటి.. 'ఇండస్ట్రీలో నిలబడాలంటే స్కిన్‌ షో తప్పనిసరి. సినిమాలో బికినీ వేసుకోక తప్పదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు గాడ్‌ ఫాదర్‌ లేరు. స్వయం కృషితోనే ముందుకెళ్లాలి. కానీ, అదిల్‌కు ఎక్స్‌పోజింగ్‌ చేయడం ఇష్టం లేదు. ఎలాంటి దుస్తులు ధరించాలో ఆయనే నిర్ణయిస్తున్నాడు. ఇకపై నేనూ కూడా లిమిట్‌లో ఉండాలనుకుంటున్నా' అంటూ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

Advertisement

Next Story