- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమ గుడ్డిదే.. నిరూపించిన విచిత్ర వివాహాలు
దిశ, ఫీచర్స్ : సాధారణంగా లవ్ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ విషయంలో కొందరు.. వాళ్లు అనుకున్నది చేసేంతవరకు నిద్రపోరు. సమాజం ఏమనుకుంటుందని పట్టించుకోరు. అయితే ప్రేమ అనేది మనుషుల మధ్య పుడితే ఒక అర్థం ఉంటుంది. అలాకాకుండా మనిషికి, బొమ్మలకు మధ్య పుడితే.. ఈ మధ్య ఇలాంటి పెళ్లిళ్లు చాలానే జరిగాయి. అందులో ఎవరెవరు ఏ జంతువులు, వస్తువులతో పెళ్లి చేసుకున్నారో చూడండి.
ఉమెన్ వెడ్స్ క్యాట్
జంతువుల పట్ల ఎంతో ప్రేమ చూపించే 49 ఏళ్ల డెబోరా హార్డ్ అనే మహిళ లండన్‌లో తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే పెంపుడు జంతువులను నిషేధించిన ఇంటి యజమాని ఆంక్షలను నివారించేందుకు డెబోరా.. 'ఇండియా' అనే తన పెంపుడు పిల్లిని వివాహం చేసుకుంది. ఇంటి అద్దె ఒప్పందంలో ఇప్పటికే మూడు జంతువులను వదిలించుకోవాల్సి వచ్చిందని, అందుకే పెళ్లి చేసుకున్నానని వివరించింది.
ఉమెన్ మ్యారీడ్ టు వాల్
ఈజా-రియిట్టా బెర్లినర్-మౌర్(Eija-Riitta Berliner-Mauer)స్వీడిష్ మహిళ ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అనే కండిషన్‌తో బాధపడుతోంది. ఆమె ఇంటి పేరు జర్మన్‌లో బెర్లిన్ గోడ అని అర్థం. అందువల్ల కొన్నేళ్లుగా వాల్ ఫొటోలను సేకరిస్తూ వచ్చింది. చివరికి ఒక వాల్‌తో మ్యారేజ్ చేసుకుంది. కానీ దురదష్టవశాత్తు ఆ గోడను కూల్చివేయడంతో.. తన భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
మ్యాన్ మ్యారీడ్ టూ క్యాట్
పెట్ లవర్ అయిన జర్మన్ పోస్ట్‌మ్యాన్ ఉవేమిట్జ్ షెర్లిచ్ అతను పెంచుకుంటున్న పిల్లిని షాదీ చేసుకున్నాడు. ఉవేమిట్జ్ ప్రకారం.. ఆస్త్మా, ఊబకాయంతో బాధపడుతున్న తన పిల్లి చనిపోయేలోపు పెళ్లి చేసుకుందామనుకున్నానని.. అయితే జంతువును వివాహం చేసుకోవడం చట్టవిరుద్దం కాబట్టి ఒక టెలివిజన్ నటికి €300($428) చెల్లించాడు.
వీడియో గేమ్ క్యారెక్టర్‌ని పెళ్లి చేసుకున్న వ్యక్తి
2018లో టోక్యోలో జరిగిన ఒక అనధికారిక వేడుకలో వీడియో గేమ్‌లలో నటించిన కంప్యూటర్ సింథసైజ్డ్ పాప్ సింగర్ అయిన 38 ఏళ్ల జపనీస్ వ్యక్తి.. అకిహికో కొండో హట్సునే మికు అనే కాల్పనిక పాత్రను వివాహం చేసుకున్నాడు. దీనిపై మాట్లాడిన అతను.. ఆ వస్తువు నిజం కాదని, కానీ ఆమె పట్ల తన భావాలు నిజమైనవని పేర్కొన్నాడు. అంతేకాకుండా మేము కలిసినప్పుడు ఆమె నన్ను నవ్విస్తుంది, అందుకే ఆమె కల్పితం కాదు నిజం.
పామును పెళ్లాడిన మహిళ
2006లో ఒడిశాకు చెందిన భీమ్లా దాస్ పామును పెళ్లి చేసుకుంది. పాము కలలోకి వచ్చి తనకు ప్రపోజ్ చేసింది. గత జన్మలో స్నేక్‌తో మ్యారేజ్ అయిందని.. ఇంకెవరితోనూ పెళ్లి చేసుకోవద్దని పాము చెప్పిందని భీమ్లా తెలిపింది.