కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

by Harish |
కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
X

గాంధీనగర్: గుజరాత్‌లో సోమవారం వేకువజామున కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భరూచ్ జిల్లాలోని పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు బాధితులు ఒక రియాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. భారీ ఎత్తున పేలుడు జరగడంతో అక్కడిక్కడే మరణించారు' అని జిల్లా ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. రియాక్టర్ పేలుడుతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు వెల్లడించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Next Story

Most Viewed