- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, ముధోల్ రూరల్: దళిత బహుజనుల హక్కులకోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల హక్కులకోసం సర్వాయి పాపన్న పోరాడారని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. గౌడ సమాజం అభ్యున్నతికి ప్రభుత్వం సైతం కృషి చేస్తుందని వెల్లడించారు.
మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం గౌడ సోదరులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా గౌడ సోదరులు ఎదిగినప్పుడు సమాజంలో గుర్తింపు లభిస్తుందని వివరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన బాటలో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దోరా రామగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మి నర్సాగౌడ్, సర్పంచ్ వెంకటాపుర్ రాజేందర్, తహశీల్దార్ శ్యామసుందర్, ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంపీటీసీలు దేవోజి భూమేష్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ మురళి గౌడ్, డా. ముష్కం రామకృష్ణ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యదర్శి ఫనిందర్ గౌడ్, విగ్రహదాత దేవేందర్ గౌడ్, ఎ. మురళీ గౌడ్, అంజగౌడ్, నగేష్ గౌడ్, శంకర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, కనక గౌడ్, స్వామిగౌడ్, పోతన్నయాదవ్, రోళ్ల రమేష్, ఖాలీద్, దత్తగౌడ్, దేవేందర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.