- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనం సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల అంచనాలను తారుమారు చేయడమేగాక, అబ్బురపరిచింది. రికార్డు స్థాయి కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఈ సినిమా గురించి ఆలస్యంగా స్పందించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్, తారక్‌లను ఆకాశానికెత్తేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో తనకు 50 సీన్లు తనను కట్టిపడేశాయని, దాదాపు పది సన్నివేశాల్లో కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తనకు గొప్ప అనుభూతి ఇచ్చిందని, చాలా నచ్చేసిందని అన్నారు. కాగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలివియా కీలక పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.