మరోసారి ఆ హిట్ కాంబో రిపీట్.. ‘గోల్‌మాల్-4’ సీక్వెల్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-11-11 10:32:51.0  )
మరోసారి ఆ హిట్ కాంబో రిపీట్.. ‘గోల్‌మాల్-4’ సీక్వెల్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగన్(Ajay Devgn), రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలకు భారీ క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ హిట్ సాధించాయి. ఇక ఇటీవల వచ్చిన ‘సింగం అగైన్’(Singham Again) థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ శెట్టి(Rohit Shetty) అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించారు. అజయ్ దేవగన్‌(Ajay Devgn)తో మరో ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్లు వెల్లడించారు.

‘గోల్‌మాల్’(Golmaal: Fun Unlimited) సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు తెలిపారు. త్వరలోనే అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి, ఎంటర్‌టైన్ చేయడానికి ‘గోల్‌మాల్-5’ తెరకెక్కిస్తున్నా అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా 2006లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా ‘గోల్‌మాల్ రిటర్న్స్’(Golmaal Returns) 2008లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 2010లో ‘గోల్‌మాల్-3’ 2017లో ‘గోల్‌మాస్-4’ వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాలకు సీక్వెల్‌గా ‘గోల్‌మాల్-5’(Golmaal -5) రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed